జూబ్లీహిల్స్, వెలుగు : తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్ ను మధురానగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సిటీ కమిషనరేట్పరిధిలో తన్నూ ఖాన్‌పై సుమారు 25 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉండడంతో ఇంతవరకు అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
2023లో నలుగురు యువకులను చితక బాదిన ఘటనపై మధురానగర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కర్రలతో, కత్తులతో దాడిచేసి బెదిరించినందుకు తన్నూ పై ఆర్మ్స్ యాక్ట్నమోదు చేశారు. ఇటీవల నాలాను ఆక్రమించి ప్రభుత్వ భూమిలో ఐరన్షెడ్స్వేసినందుకు తన్నూపై జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై మరో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.