- ప్రభుత్వానికి మధురానగర్ ప్లాట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి
ఖైరతాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలో తాము కొనుగోలు చేసిన ప్లాట్స్ ధరణిలో వేరొక సంస్థ పేరిట కనిపిస్తున్నాయని మధురానగర్ ప్లాట్స్వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 70 ఎకరాల్లో 800 ప్లాట్లు వేశారని, వాటిలో తామంతా ప్లాట్లు కొనుగోలు చేశామని అసోసియేషన్ కోశాధికారి హరి ఆంజనేయులు, నర్సింహరెడ్డి, లక్ష్మారెడ్డి, రామ్‌గోపాల్, సత్యనారాయణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం వారు మాట్లాడారు. ఎంవీ రంగాచారి అనే వ్యక్తి వద్ద తాము 2015లో ప్లాట్లు కొనుగోలు చేశామన్నారు. ఈసీలో తమ ప్లాట్లు తమ పేర్లపైనే ఉన్నాయని, ధరణిలో మాత్రం ఆమోద బిల్డర్స్పేరుతో చూపిస్తున్నాయన్నారు. అలా ఎందుకు జరిగిందో తెలియడం లేదన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ప్లాట్లను తమకు చెందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.