సీఎంఆర్ గడువులోగా కంప్లీట్ చేయాలి : డి. మధుసూదన్ నాయక్

ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 31లోపు సీఎంఆర్ డెలివరీ కంప్లీట్​చేయాలని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ మిల్లర్లను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలోని సత్యనారాయణ సిల్కి అండ్ సార్టెక్స్ రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు.

ఖరీఫ్ సీఎంఆర్ డెలివరీ విషయమై, కేటాయించిన లక్ష్యం, ఇంతవరకు అందించిన రైస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 3,354.577 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉందన్నారు. ఇన్​టైంలో లక్ష్యాలు చేరుకోని రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.