50 ఆవులను నదిలోకి తోలిన ఆకతాయిలు... మధ్యప్రదేశ్​లో 20 ఆవులు మృతి

50 ఆవులను నదిలోకి తోలిన ఆకతాయిలు... మధ్యప్రదేశ్​లో 20 ఆవులు మృతి

సాత్నా: మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కొంత మంది ఆకతాయిలు 50 ఆవులను సాత్నా నదిలోకి తోలారు. ఈ ప్రమాదంలో కనీసం 15 నుంచి 20 ఆవులు మరణించాయి. మంగళవారం నాగోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు నలుగురిపై కేసును నమోదు చేశారు.

బామ్‌‌ హోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద ఉన్న సాత్నా నదిలోకి నలుగురు వ్యక్తులు 50 ఆవులను తోలారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీని ఆధారంగా స్పాట్​కు చేసుకున్న పోలీసులు సమాచారాన్ని సేకరించారు. వారిపై కేసు నమోదు చేశారు. ఆవులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు.