మధ్యప్రదేశ్: తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేదన్న కారణంతో పైశాచికంగా ప్రవర్తించాడో వ్యక్తి. తన బాకీ తీర్చలేదన్న కోపంతో అతనిపై తీవ్రంగా దాడి చేసి అతని ప్రైవేటు భాగాల్లో కారం గుప్పి వికృతంగా ప్రవర్తించాడు. ఖార్గోన్ జిల్లాలోని కాస్రావాడ్‌లో జరిగిందీ ఘటన.
అప్పు తీర్చలేని వ్యక్తి ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని కళ్ళు, చెవులుకు గాయాలవడంతో ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి జరుగుతున్న సమయంలో పక్కనున్న వ్యక్తి వీడియో తీయడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఇది తీవ్రమైన అమానుష చర్యగా ఖండిస్తున్నారు.