- మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో వెలుగులోకి ఘటన
గుణ : సాధారణంగా బోరింగ్ కొడితే నీళ్లు వస్తాయి. కానీ మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లా భాన్పూర గ్రామంలో బోరింగ్ కొడితే నాటుసారా వస్తది. ఈ విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. భాన్పూర గ్రామంలో భారీగా మద్యం నిల్వలు దాచారని సమాచారం అందడంతో పోలీసులు ఆ గ్రామంలో తనిఖీలు చేశారు. అక్కడ ఒక బోరింగ్ ను కొట్టి చూడగా నీళ్ల బదులు నాటుసారా వచ్చింది.
నిందితులు వ్యవసాయ పొలాల్లో భూమిని తవ్వి కింద పెద్దపెద్ద డ్రమ్ములు పెట్టారు. ఆ డ్రమ్ముల్లో మద్యం పోసి ఉంచారు. వాటిని చేతిపంపుతో అటాచ్ చేశారు. ఈ చేతిపంపు కొట్టినపుడల్లా డ్రమ్ముల నుంచి మద్యం వస్తున్న విషయం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. అండర్ గ్రౌండ్ లో దాచిన ఎనిమిది మద్యం డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసులు వస్తున్నారన్న విషయం తెలిసి నిందితులు పారిపోయారు.