- బ్రాహ్మణ జంటలకు మధ్యప్రదేశ్బ్రాహ్మణ బోర్డ్ చీఫ్ ఆఫర్
భోపాల్: దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒక్కో బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కనడం చాలా ముఖ్యమని మధ్యప్రదేశ్ బ్రహ్మణ బోర్డు ‘‘పరశురామ కల్యాణ్ బోర్డ్” ప్రెసిడెంట్ పండిట్ విష్ణు రాజోరియా పిలుపునిచ్చారు. నలుగురు పిల్లలను కనే జంటలకు లక్ష రూపాలయ బహుమతి ఇస్తామని తెలిపారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలు బతకడానికి దేశంలో ఎటువంటి వనరుల కొరత లేదన్నారు.
‘‘బ్రాహ్మణులు నలుగురు పిల్లలు కనడం తప్పనిసరి అని.. యువ జంటలకు పరశురామ కళ్యాణ్ బోర్డు అధిపతిగా, వ్యక్తిగత హోదాలో విజ్ఞప్తి చేశాను. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి జంటలు ఎక్కువ మంది పిల్లలను కనడం చాలా ముఖ్యం, తద్వారా వారిలో ఒకరు కుటుంబాన్ని చూసుకోగలరు, సంపాదించగలరు. మోక్ష ధర్మం సాధించగలరు” అని రాజోరియా అన్నారు.