మధ్యప్రదేశ్‌లోని సత్నా పట్టణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు తెలిపారు. బీహారీ చౌక్ ప్రాంతంలో అక్టోబర్ 3న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
"మాకు అందిన సమాచారం ప్రకారం, ఈ భవనం కుప్పకూలింది. ఇక్కడ భవనం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. లోపల ఎంతమంది చిక్కుకుపోయారో స్పష్టంగా తెలియలేదు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి" అని సాత్నా ఎమ్మెల్యే సిద్ధార్థ్ కుష్వాహా తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామన్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు కూలీలను రక్షించినట్లు సత్నా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ గెహ్లాట్ తెలిపారు. శిథిలాల కింద ఇద్దరు కూలీలు చిక్కుకున్నారని తమకు సమాచారం అందిందని... సహాయక చర్యలు చేపట్టామని, వారిద్దరినీ విజయవంతంగా రక్షించామని ఆయన చెప్పారు. అయితే ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఇంకా నిర్దిష్ట వివరాలను అందించాల్సి ఉంది.
VIDEO | Rescue operation continues after a three-storeyed building collapsed in Satna, Madhya Pradesh last evening.
— Press Trust of India (@PTI_News) October 4, 2023
STORY | Several feared trapped as three-storey building collapses in Madhya Pradesh's Satna
READ: https://t.co/pj0Da0Y6DH pic.twitter.com/7nbubSLaDe