వ్యాపారి ఇంట్లో తడిసిన నోట్ల కట్టలు

వ్యాపారి ఇంట్లో తడిసిన నోట్ల కట్టలు

భోపాల్:  మధ్యప్రదేశ్ లోని ఓ వ్యాపారి ఇంటిపై రెయిడ్ చేసిన ఐటీ అధికారులు అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులో దాచి ఉంచిన రూ. కోటి క్యాష్ ను పట్టుకున్నారు. నీళ్లలో తడిసిన నోట్లను డ్రయ్యర్‌‌తో ఆరబెడుతూ, ఇస్త్రీ చేస్తున్న వీడియో వైరల్ అయింది. స్టేట్ లోని దమోహ్ జిల్లాకు చెందిన బిజినెస్ మాన్ శంకర్ రాయ్ కి చెందిన ఇండ్లు, ఆఫీసులు సహా పది చోట్ల గురువారం తెల్లవారుజాము నుంచి 39 గంటలపాటు జరిగిన ఈ రెయిడ్స్ లో నీటి ట్యాంకులో దాచిన క్యాష్​ సహా మొత్తం రూ. 8 కోట్ల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 5 కోట్ల విలువైన నగలను, మూడు కిలోల గోల్డ్ ను కూడా సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.