మధ్యప్రదేశ్లో బార్లు బంద్

మధ్యప్రదేశ్లో బార్లు బంద్

మధ్యప్రదేశ్ లో అన్ని బార్లను మూసివేస్తూ  కొత్త ఎక్సైజ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. షాపుల్లో పర్మిట్ రూములను కూడా అనుమతించబోమని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. లిక్కర్ షాపుల కాంట్రాక్ట్ రెన్యూవల్ ఛార్జీలను 10 శాతం పెంచుతామని అన్నారు. బార్ లు తెరవాలని ఎవరైనా నిరసనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

ఇక  విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్లు, మత స్థలాల నుంచి మద్యం షాపుల దూరాన్ని 50 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచుతున్నామని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేసే చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్నారు. రాష్ట్రంలో నియంత్రిత మద్యం విధానాన్ని  అమల్లోకి తీసుకురావాలని ఎంపీ ఉమాభారతి డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఆమోదించిన కొత్త ఎక్సైజ్ పాలసీ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని తెలుస్తోంది.