ది సబర్మతి రిపోర్ట్ సినిమాకి ట్యాక్స్ లేదని ప్రకటించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి..

ది సబర్మతి రిపోర్ట్ సినిమాకి ట్యాక్స్ లేదని ప్రకటించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి..

హిందీలో 12థ్ ఫెయిల్ మూవీ ఫేమ్ విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన "ది సబర్మతి రిపోర్ట్" నవంబర్ 15న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా, రిధి డోగ్రా హీరోయిన్లుగా నటించగా 2002లో జరిగిన గోద్రా రైలు సంఘటనల ఆధారంగా ప్రముఖ డైరెక్టర్ ధీరజ్ సర్నా తెరకెక్కించాడు. 

ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దేశప్రధాని నరేంద్ర మోడీ సైతం "ది సబర్మతి రిపోర్ట్" చిత్ర టీమ్ ని అభినందించారు. అలాగే చివరికి నిజం బయటికొచ్చిందంటూ సోషల్ మీడియాలోని ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీంతో కేంద్ర హోమ్ మంత్రి  అమిత్ షా కూడా ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించాడు.

అయితే సోమవారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ది సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రసంశలు కురిపించారు.  ఈ సినిమాని మరింతమంది చూసేందుకుగానూ మధ్యప్రదేశ్ లో ఎలాంటి ట్యాక్స్ వసూలు చెయ్యమని తెలిపారు. అలాగే ది సబర్మతి రిపోర్ట్ సినిమాని పన్ను రహిత సినిమాగా ప్రకటించారు. ఈ సినిమాని తన కేబినెట్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చూడాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మరింతమంది దర్శకనిర్మాతలు మంచి సినిమాలు 

ఈ విషయం ఇలా ఉండగా విక్రాంత్ మాస్సే ఈ మధ్య ఎక్కువగా రియల్ లైఫ్ స్టోరీస్ ఎంచుకుంటూ అలరిస్తున్నాడు. అయితే ది సబర్మతి రిపోర్ట్ సినిమా ఇప్పటివరకూ రూ.7.5 కోట్లు కలెక్షన్లు రాబట్టింది.