కరోనా కారణంగా అనాథలైన చిన్నారులతో దీపావళిని జరుపుకున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో గడిపారు. తన సతీమణితో కలిసి అధికారిక నివాసంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. పిల్లలకు స్వీట్స్ తినిపించారు. తన సతీమణితో కలసి భోజనం వడ్డించారు. వారి ముఖంలో చిరునవ్వు తనకు సంతోషాన్నిస్తోందని శివరాజ్ చెప్పారు. జీవితంలో ఎప్పుడూ నిరాశ పడకూడదని వారికి సూచించారు శివరాజ్ సింగ్ చౌహాన్. జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని చెప్పారు. తాను వారికి మేనమామలా అండగా నిలుస్తానని, తమ మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తానని సీఎం చెప్పారు.
दीप जलाते, भोजन करते मेरे इन बच्चों के चेहरे पर जो ऊर्जाभरी मुस्कान थी, वह देखकर मन को संतोष हुआ।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 4, 2021
भगवान से यही प्रार्थना करता हूं कि हे मेरे प्रभु मुझे इतनी सामर्थ्य देना कि इनके चेहरे पर कभी उदासी न आने दूं। मैं इनके मामा और माता-पिता का भी प्यार दे सकूं। #AaoFirSeDiyaJalayen pic.twitter.com/wHVA8gW4JB