బీఆర్ఎస్ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు.. బీజేపీకి పది సీట్లు పక్కా: శివరాజ్ సింగ్

బీఆర్ఎస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదన్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.  జాతీయ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ ఎక్కడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.

బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి హాజరైన శివరాజ్ సింగ్ చౌహాన్..పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో 10కిపైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణలో తొలి విజయం కరీంనగర్ నుండే శ్రీకారం చుట్టాలన్నారు.  బండి సంజయ్ ను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

మధ్యప్రదేశ్ ప్రజలంతా మామాజీ అని ఆప్యాయంగా పిలుచుకునే శివరాజ్ సింగ్ చౌహాన్ కరీంనగర్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ లో ఇంటింటికీ అయోధ్య రామయ్య పొటో ఫ్రేమ్ లు అందజేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు బండి సంజయ్