కొత్తగా పెళ్లైన జంట మండుటెండలో బైక్‌పై వెళ్తున్నారు. ఇది చూసిన ఎమ్మెల్యే తన కారులో వారికి లిఫ్ట్ ఇచ్చారు. వధువును సోదరిగా పేర్కొన్న ఆయన ఆ జంటను స్వయంగా వారి ఇంటి వద్ద దింపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
#WATCH | Raghogarh MLA Jaivardhan Singh Halts Campaigning, Offers Car Ride To Newly-Wed Couple After Seeing Them On Bike On A Hot Afternoon#MadhyaPradesh #MPNews #LokasabhaElection2024 #Gwalior pic.twitter.com/T7BbYeee9u
— Free Press Madhya Pradesh (@FreePressMP) May 1, 2024
భోపాల్‌లో కొత్తగా పెళ్లైన జంట మండుటెండలో బైక్‌పై వెళ్తున్నారు. ఇది చూసిన ఎమ్మెల్యే తన కారులో వారికి లిఫ్ట్ ఇచ్చారు. వధువును సోదరిగా పేర్కొన్న ఆయన ఆ జంటను స్వయంగా వారి ఇంటి వద్ద దింపారు. (ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ తన తండ్రి దిగ్విజయ్ సింగ్ కోసం ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. బుధవారం( మే 1) ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న జైవర్ధన్ సింగ్, ఆ తర్వాత కారులో తిరిగి వెళ్తున్నారు.
కాగా, మండుటెండలో బైక్‌పై వెళ్తున్న కొత్తగా పెళ్లైన జంటను ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ గమనించారు. దీంతో వెంటనే కారు ఆపాలని డ్రైవర్‌కు చెప్పారు. తన కారులో కూర్చోవాలని ఆ జంటను కోరారు. వధువును తన సోదరిగా పేర్కొన్న ఆయన ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని వరుడితో అన్నారు.
మరోవైపు గుడిని సందర్శించి ఎండలో తిరిగి వెళ్తున్న కొత్త దంపతులు బైక్ దిగి .... ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ కారు వెనుక సీటులో కూర్చొన్నారు. వారి ఇంటి వద్దకు ఆయన తీసుకెళ్లారు. అనంతరం స్వయంగా కారు డోర్ తీసి ఆ కొత్త జంటకు స్వాగతం పలికారు. అయితే నూతన వధూవరులు ఖరీదైన ఫార్చ్యూనర్ కారు నుంచి దిగడం చూసి వారి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.