భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ.. 39 మంది తమ పార్టీకి చెందిన నేతలపై బహిష్కరణ వేటు వేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన చోట వీరు రెబెల్స్‌గా పోటీకి దిగుతుండడంతో ఈ చర్యలు తీసుకుంది. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసి.. ఆరేండ్ల పాటు బహిష్కరించింది.
ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కమల్ నాథ్ ఆదేశాలమేరకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బహిష్కరణకు గురైన వారిలో మాజీ ఎంపీ ప్రేమ్‌చంద్ గుడ్డు, మాజీ ఎమ్మెల్యే అంతర్ సింగ్ దర్బార్, మాజీ ఎమ్మెల్యే యద్వేంద్ర సింగ్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అజయ్ సింగ్ యాదవ్, నాసిర్ ఇస్లాం, అమీర్ అక్వీల్ తదితరులు ఉన్నారు.