రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర.. పేదలను మోదీ ప్రభుత్వం దోచుకుంటుంది

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర..  పేదలను మోదీ ప్రభుత్వం దోచుకుంటుంది

మధ్యప్రదేశ్​ లో అంబేడ్కర్​ స్వగ్రామం మోవ్​ లో  కాంగ్రెస్​ సంవిధాన్​ బచావత్​ ర్యాలీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ప్రసంగించారు.   బీజేపీ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు.   కేంద్ర హోం మంత్రి అమిత్ షా ...  డాక్టర్ అంబేద్కర్‌ను అగౌరవపరిచారని ఆరోపిస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్నారు.   ఆర్‌ఎస్‌ఎస్, మోదీ  ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ.. ట్యాక్స్​ ల పేరుతో పేద ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు.  అంబేడ్కర్​ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చాలని కుట్రలు చేస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 

ALSO READ | అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి: ‘సంవిధాన్ బచావ్’ ర్యాలీలో రాహుల్ డిమాండ్

 కేంద్రప్రభుత్వం .. రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రయోజనాలకు ద్రోహం చేస్తుందని, అణగారిన వర్గాల హక్కులపై దాడి చేస్తుందని ఖర్గే  ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాలు అవమానాలకు గురవుతున్నాయని పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతూ  జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.