కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మే 31తో ముగుస్తున్న లాక్ డౌన్ 4.0ను మరికొన్ని రోజులు పొడిగించాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 15 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగిస్తామని శనివారం ఆయన ప్రటించారు. కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ లో 7,645 మందికి వైరస్ సోకింది. అందులో 4,269 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 334 మంది మరణించారు. ప్రస్తుతం 3042 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
We will be extending the lockdown till June 15 to fight #COVID19: Madhya Pradesh CM Shivraj Singh Chouhan (file pic) pic.twitter.com/eW9plI1pQV
— ANI (@ANI) May 30, 2020