ఫస్ట్ క్లాస్ నుంచి పీహెచ్ డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్

ఫస్ట్ క్లాస్ నుంచి పీహెచ్ డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్

సాంబల్ స్కీమ్ ను తిరిగి ప్రారంభించిన మధ్యప్రదేశ్
వెల్లడించిన జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లోని పేద పిల్లల చదువుకయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నట్లు బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సాంబల్ స్కీమ్ కింద పేద కుటుంబాల పిల్లలకు 1వ తరగతి నుంచి పీహెచ్ డీ వరకు అయ్యే విద్యా ఖర్చులను సర్కార్ భరిస్తుందన్నారు. ప్రైవేటు కాలేజీల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే వెచ్చిస్తుందని చెప్పారు.

పేదలు తమ పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించాలని ట్విటర్ లో సింధియా ట్వీట్ చేశారు. సమాజంలోని అన్ని నిరుపేద వర్గాలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకాన్ని నేడు మళ్లీ ప్రారంభించారని సింధియా పేర్కొన్నారు. ఈ స్కీమ్ కు సూపర్–500 అనే మరో పథకాన్ని జత చేస్తున్నామని తెలిపారు. తద్వారా క్లాస్–12లో అత్యధిక మార్కులు సాధించిన పేద పిల్లలకు అదనంగా రూ.30 వేలు ఇస్తామని వెల్లడించారు.

View this post on Instagram

आज 1863 हितग्राहियों के खाते में 41.29 करोड़ रुपए ई – भुगतान के माध्यम से ट्रांसफर कर #संबल_योजना को रिलॉन्च किया। संबल योजना हमारे गरीब भाई-बहनों के परिवारों को नया जीवन देने वाली योजना है। जन्म से पहले से लेकर ज़िन्दगी के बाद तक इस योजना का गरीब परिवारों को लाभ मिलेगा इस योजना में हम एक नई "सुपर 5000" योजना को जोड़ रहे हैं। संबल परिवारों के ऐसे 5000 बच्चे जो 12वीं में सबसे ज्यादा नंबर लाएंगे, उन्हें ₹30000 प्रोत्साहन राशि के रूप में अलग से दिए जाएंगे। #संबल_योजना आज से नये रूप में प्रारंभ हो रही है। मुझे विश्वास है कि यह मेरे गरीब बहनों-भाइयों को समस्याओं से निजात दिलाकर उनके जीवन को आसान बनाएगी।

A post shared by Shivraj Singh Chouhan (@chouhanshivrajsingh) on

‘సాంబల్ స్కీమ్ ను నేటి నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా పేదల సమస్యలు తీరతాయని భావిస్తున్నా. అలాగే వారి బతుకులు సులువుగా అవుతాయని అనుకుంటున్నా’ అని రాజస్థాన్ సీఎం శివరాజ్ చౌహాన్ ఇన్ స్టాగ్రామ్ పోస్టులో చెప్పారు.