మోహన్ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం మహిళలకే

మోహన్ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం మహిళలకే

మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. ఆ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లను 35 శాతానికి పెంచింది. అందుకు మంత్రి మండలి మంగళవారం(నవంబర్ 05)  ఆమోదం తెలిపింది. మంగళవారంరాష్ట్ర రాజధాని భోపాల్‌లోని మంత్రాలయలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. 

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ సర్వీసుల కింద అన్ని రిక్రూట్‌మెంట్లలో (మహిళలకు) రిజర్వేషన్లను 33 శాతం నుండి 35 శాతానికి పెంచామని మధ్యప్రదేశ్ డిప్యూటీ సిఎం రాజేంద్ర శుక్లా చెప్పారు. ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ మంగళవారం ఆమోదించిందని తెలిపారు. మహిళా సాధికారతకు ఇదొక ముందడుగని ఆయన అభివర్ణించారు. 

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండగా.. దానిని 2 శాతం అదనంగా పెంచింది.