అన్నంతోపాటు పాపడాలు తినడం చాలామందికి అలవాటు. కానీ మధ్యప్రదేశ్ లోని దిందోరీలో ఉండే లాయర్ దయారాం సాహూకు మాత్రం గాజు ముక్కలే పాపడాలు. ఎక్కడైనా గాజు పెంకులు, సీసాలు కనిపిస్తేచాలు కరకరా నమిలేస్తాడు.బీరు సీసాలను కూడా తినేసి అరిగించుకుంటున్నా డు. ఈ అలవాటు గత 45 ఏళ్లు గా ఉందట. చిన్నప్పటి నుంచే గాజు ముక్కలు తినడం వ్యసనంగా మారిందని, అలవాటును మానలేకపోతున్నా నని చెబుతున్నా డు. అయితే ఇప్పటిదాకా ఎటువంటి సమస్య ఎదురుకాలేదట. వయసు మీద పడుతున్న కారణంగా భవిష్యత్తులో ఎదైనా ప్రాబ్లమవుతుందనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు గాజు సీసాలు కనపడకుండా దాచేస్తున్నా రట.
చాలా ప్రమాదకరం..
‘గాజుపెంకులు తినడం వల్ల నా పళ్లు దెబ్బతిన్నా యి. అయినా తినకుండా ఉండలేకపోతున్నా . గాజు పెంకులు తినాలని నేను ఎవరికీ చెప్పను. ఎందుకంటే ఇలా తినడం చాలా ప్రమాదకరమని తెలుసు. ఇటీవలే నా శరీరంలోపల కొన్ని చోట్ల గాయాలైనట్లు డాక్టర్లు గుర్తిం చారు.అందుకే ఈ మధ్య తినడం తగ్గించాను. అయితే పూర్తిగా మానడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను.