భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీ క్లాస్ రూమ్‌లో ఓ ముస్లిం స్టూడెంట్ హిజాబ్ ధరించి నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో వర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు. వీడియో క్లిప్‌తో పాటు ఫిర్యాదు అందిందని వర్సిటీ రిజిస్ట్రార్ సంతోశ్ సహగౌరా శనివారం మీడియాకు తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీ మూడ్రోజుల్లో రిపోర్టు ఇస్తుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, వర్సిటీ క్యాంపస్‌లో స్టూడెంట్లు ప్రత్యేకంగా యూనిఫామ్ ధరించాలనే రూలేమీలేదని వర్సిటీ మీడియా రిలేషన్స్ ఆఫీసర్ వివేక్ జైస్వాల్ తెలిపారు. కానీ, తప్పనిసరిగా బేసిక్ ఎథికల్ డ్రెస్సింగ్ ఫాలో కావాల్సి ఉంటుందన్నారు. మంచ్ నేతలు మాట్లాడుతూ ఇలాంటి మతపరమైన పద్ధతులను విద్యాసంస్థల్లో అనుమతించకూడదన్నారు. ఆ అమ్మాయి చాలారోజులుగా హిజాబ్‌తోనే క్లాసులకు వస్తోందని మండిపడ్దారు. క్లాస్ రూమ్‌లలో హిజాబ్, తలపాగా ధరించొద్దని కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును వారు గుర్తుచేశారు.
MP | We've notified a committee to probe the matter & directed all students that since this is a central university, all religious acts are to be done in personal premises/religious places: Neelima Gupta, VC, Dr Harisingh Gour Sagar Uni,on a student offering Namaz in uni premises pic.twitter.com/hiP2K9R87L
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 26, 2022