కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి చెందిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) అసీమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆగస్టు 2న ఉదయం కునో నేషనల్ పార్క్‌లో ఆడ చిరుత 'ధాత్రి' చనిపోయింది. ప్రస్తుతం చిరుత మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి, పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు అని అటవీశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రాజెక్ట్ చిరుత కింద, నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (KNP)కి మొత్తం 20 రేడియో కాలర్ జంతువులు దిగుమతి అయ్యాయి. ఆ తరువాత నమీబియా చిరుత 'జ్వాలా'కు నాలుగు పిల్లలు జన్మించాయి. ఈ 24 చిరుతల్లో.. తాజాగా ఈ మరణంతో సహా తొమ్మిది చిరుతలు చనిపోయాయి. కొన్ని చిరుతలకు రేడియో కాలర్‌ల వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చినట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి.