Viral news: ఆవులతో అసహజ శృంగారం.. ఇద్దరు అరెస్ట్

Viral news: ఆవులతో అసహజ శృంగారం.. ఇద్దరు అరెస్ట్
  • ఇద్దరు వ్యక్తుల అరెస్టు
  • మధ్యప్రదేశ్​లో ఘటన

భోపాల్​: ఆవులతో అసహజ శృంగారంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇండోర్ లో ఒకరిని, అదే విధంగా మందసౌర్ జిల్లాలో మరొకరికి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..మొదటి ఘటన ఇండోర్​ జిల్లాలో జరిగినట్లు చెప్పారు.

 ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వెలుగు చూడటంతో హిందూ సంఘాల ఆందోళనకు దిగాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సమీపంలోని భవనంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా విషయం నిర్థారణ చేసుకొని నిందితుడు విజయ్​ ఆశిర్వార్​ను అరెస్టు చేశారు. 

►ALSO READ | అద్దె ఇంట్లో పోలీసుల సోదాలు.. గుట్టలు గుట్టలుగా రూ.500 నకిలీ నోట్ల కట్టలు..

మరో ఘటనలో ఇండోర్​కు 2‌‌‌‌‌‌‌‌00కి.మీ.ల దూరంలోని మండసౌరి జిల్లా అఫ్జల్​పూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరగ్గా, ఆ ఘటనలో నిందితుడు ద్వారకా గోస్వామిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రివెన్షన్​ ఆఫ్​ క్రుయాల్టీ టు యానిమల్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.