రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను 1 నుంచి 12వ తరగతి వరకు ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, ఇతర వేడుకలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. మకర సంక్రాంతి స్నానాలపై నిషేధం లేదని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
మధ్యప్రదేశ్ లో నిన్న ఒక్క రోజే కొత్తగా 4,031 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. పాజిటివిటీ రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది.
మరిన్ని వార్తల కోసం..