సెక్స్ స్కాండల్​.. అప్పుడు వల..ఇప్పుడు విలవిల

కమల్​నాథ్​ పోయిన డిసెంబర్​లో సీఎం పీఠం ఎక్కాక మొట్టమొదటి కుదుపు తగిలింది. అలాగని, ఇంతకాలం సుఖంగా సాగిపోయిందని కాదు. కాంగ్రెస్​ సీఎంలకు సహజంగానే సొంత పార్టీలో అసమ్మతి సెగ ఉంటుంది. అందులోనూ సంజయ్​గాంధీ కాలంనాటి సీనియర్లకు, రాహుల్​ గాంధీ ఈడు వాళ్లైన జూనియర్లకు మధ్య బాగానే రగడ సాగుతోంది. కొత్తగా కమల్​నాథ్​ ప్రభుత్వానికి ‘హనీ ట్రాప్​ స్కాండల్​’ చుట్టుకుంది. ఉద్యోగాలు, స్కాలర్​షిప్పులు ఇప్పిస్తామని అమాయక యువతులకు ఎరచూపించి, వాళ్లను తమకు కావలసినవాళ్లపైకి ఉసిగొల్పుతున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. రెండువారాల క్రితం వెలుగు చూసిన ఈ స్కాంలో సీనియర్​ బ్యూరోక్రాట్లు, పొలిటీషియన్లు చాలామంది ఉన్నట్లుగా చెబుతున్నారు. కమల్​ నాథ్​ తన ప్రభుత్వానికి మట్టి అంటకూడదన్న ఉద్దేశంతో స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​ (సిట్​)ని వేశారు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చేస్తామని చెప్పిన వారం రోజుల్లోనే సిట్​ చీఫ్​లు ముగ్గురిని మార్చేశారు. కమల్​నాథ్​ ప్రభుత్వంమీద టాప్​ లెవెల్​లో వచ్చిన వత్తిడివల్లనే ‘సిట్​’ చీఫ్​లు మారిపోతున్నట్లు సమాచారం.

ఇంతకీ ఈ స్కాండల్​ ఏమిటి? ఒక సాధారణ వ్యభిచార కేసులాంటిది కాదా ఇది? దీని దర్యాప్తు ముందుకు సాగకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇవన్నీ సాధారణ జనాలకు అనుమానాలే! సెప్టెంబర్​ 18న ఈ స్కాండల్​ వెలుగు చూసినప్పటికీ ఇప్పటికీ దీనిలో ఇన్​వాల్వ్​ అయిన యువతుల సంఖ్య 40 మందిని దాటిపోయింది. హనీ ట్రాప్​లో చిక్కుకున్న టాప్ పర్సన్లలో 12 మంది బ్యూరోక్రాట్లు, ఎనమండుగురు మాజీ మంత్రులు ఉన్నట్లు చెబుతున్నారు.​  పెద్ద తలకాయల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక గవర్నర్​కూడా ఉన్నారట! ఇదంతా చేసింది కేవలం అయిదుగురు మహిళల టీమ్​ అంటే ఆశ్చర్యపోక తప్పదు. శ్వేత జైన్​ ఈ టీమ్​కి లీడర్​గా, ఆర్తి దయాళ్​ అసిస్టెంట్​గా ఉండేవాళ్లని సిట్​ గుర్తించింది. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు స్కాలర్​షిప్పులు, కాలేజీల్లో సీట్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశలు చూపించి, బెదిరించి తమ దారికి తెచ్చుకునేవారు. సినిమాల్లో అవకాశాలకోసం ఎదురుచూస్తున్నవాళ్లను, బి–గ్రేడ్​ సినిమాల్లో యాక్ట్​ చేస్తున్నవాళ్లనుకూడా శ్వేత–ఆర్తి టీమ్​ ట్రాప్​ చేసేది.

ఆ తర్వాత టెండర్లు, కాంట్రాక్టర్లు, పోస్టింగ్​లకోసం ప్రభుత్వ పెద్దలు, సీనియర్​ ఆఫీసర్ల కోరికలు తీర్చడానికి ఈ యువతులను పంపించేవారు. ఈ టీమ్​ వెనుక బడా కాంట్రాక్టర్లున్నట్లు చెబుతున్నారు. కాలేజీ గర్ల్స్​ని కాల్​ గర్ల్స్​గా వాడుకుంటూ… కాంట్రాక్టులు శాంక్షన్​ చేయించుకోవడానికి, తమకు అనుకూలంగా టెండర్​ నోటిఫికేషన్లు రిలీజ్​ చేయడానికి, ఐఏఎస్​, ఐపీఎస్​లకు కీలక పోస్టులు ఇప్పించడానికి శ్వేత–ఆర్తి టీమ్​ పనిచేసేదట! వీళ్లు హనీ ట్రాప్​ చేసే బ్యూరోక్రాట్లు, పొలిటీషియన్లు నడివయసు దాటిపోయి ఓల్డ్​ ఏజ్​కి వచ్చేసినవాళ్లేనని, తమ కూతుళ్ల వయసున్న అమ్మాయిలతో సరసాలు సాగించేవారని శ్వేత జైన్​ పోలీసులకు వెల్లడించింది.

పదిహేనేళ్ల పాటు మధ్యప్రదేశ్​లో బీజేపీ ఏలుబడి సాగింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలే అయ్యింది. హనీ ట్రాప్​ వ్యవహారమంతా బీజేపీ హయాంలోనే సాగిందని కాంగ్రెస్​ అరోపిస్తోంది. అయితే,  స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​ (సిట్​) చీఫ్​లను ఎందుకు మారుస్తున్నారని, ఎవరి వత్తిడి పనిచేస్తోందని బీజేపీ ఎదురు ప్రశ్నిస్తోంది. ఈ స్కాండల్​ ఇండోర్​ మునిసిపల్​ కార్పొరేషన్​ ఇంజినీర్​ ఒకరిని శ్వేత–ఆర్తి టీమ్​ బ్లాక్​ మెయిల్​ చేయడంతో బయటపడింది. మునిసిపల్​ ఇంజినీర్​ హర్​భజన్​ సింగ్​ దగ్గరకు 18 ఏళ్ల మోనికా యాదవ్​ను పంపించి, అక్కడ జరిగినదంతా వీడియో షూట్​ చేశారు. ఆ తర్వాత 3 కోట్ల రూపాయలకు బ్లాక్​మెయిల్​ చేయడంతో ఆయన పోలీసుల్ని ఆశ్రయించాడు. దాంతో ఆర్తి దయాళ్​ని ,  మోనికా యాదవ్​ని అరెస్టు చేశారు. తాను రెండుసార్లు ఇండోర్​లోని ఒక హొటల్​లో సింగ్​ని కలిశానని మోనిక వెల్లడించింది. ఈ తీగను కదిలించేసరికి శ్వేత జైన్​ నడుపుతున్న డొంకంతా కదిలింది. మోనిక చెప్పిన సమాచారంతో టీమ్​ లీడర్​ శ్వేత విజయ్​ జైన్​, శ్వేత స్వప్నిల్​ జైన్​, బర్ఖా భట్నాగర్​ కూడా అరెస్టయ్యారు. మోనిక తండ్రి ఈ టీమ్​పై హ్యూమన్​ ట్రాఫికింగ్​ కేసుకూడా పెట్టారు.   దీనికి సంబంధించి అక్టోబర్​ 21 కల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇండోర్​ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ కమల్​ నాథ్​ ప్రభుత్వం ఆ పని చేయలేకపోతే సీబీఐకి కేసు అప్పజెబుతామని హెచ్చరించింది.స్కాండల్​ బయటపడి రెండు వారాలవుతున్నా అడుగు ముందుకు పడలేదంటే… శ్వేత టీమ్​ ఎంత పలుకుబడితో ఉందో తెలుస్తోంది.

హనీ ట్రాప్​ అంటే…

ప్రపంచంలో ఏ మూలనైనా సరే… సెక్స్​ స్కాండల్​ బయటపడిందంటే, మర్యాదస్తు లంతా భుజాలు తడుముకుంటారు. చాలా పెద్ద పెద్ద పనుల్ని సులువుగా చేయించు కోవడానికి వాడే వెపన్​ ‘హనీ ట్రాప్​’. డబ్బుకో, పదవికో, ప్రమోషన్​కో లొంగనివాళ్లు సైతం కంటికి నదరుగా ఉన్న అమ్మాయిని చూసి ఇష్టపడతారు. ఆ మధ్య ఓ సినిమాలో… ‘నేను అలా కన్ను కొడితే చాలు, ఇలా పడిపోతారు’ అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. ఓ అమ్మాయి వాలుచూపుతో వల విసిరి, బెడ్​ రూమ్​కి రప్పించి, తమను ఉసిగొల్పిన వాళ్లకు కావలసిన పనిని పూర్తి చేసిపెడు తుంది. ఇదంతా పైకి చిన్న విషయంగా కనిపిస్తుంది. పౌరాణిక కాలం నుంచీ ఉంది. ఋష్యశృంగుడు, శల్యుడు వంటివాళ్లు హనీ ట్రాప్​లో చిక్కుకున్నట్లు పురాణాలు చెబుతు న్నాయి. ఇప్పటికీ  సొసైటీలో, అడ్మినిస్ట్రేషన్​లో, మిలిటరీలో… రహస్య సమాచారాన్ని రాబట్టడంకోసం శత్రుగూఢచారులు  హనీ ట్రాప్​నే నమ్ముకుంటారు.

వేటకుకోడ్కూడా..

హనీ ట్రాప్​ ముఠా దగ్గర స్వాధీనం చేసుకున్న డైరీలో చాలా విషయాలు తెలిసొచ్చాయి. అండర్​ వరల్డ్​ క్రిమినల్స్​ లెవల్లో వీళ్లు హానీ ట్రాప్​ సాగిస్తుంటారు. ఆ డైరీలో ప్రయారిటీ వారీగా ఖాతాదారుల పేర్లు, ఫోన్​ నెంబర్లు, వాళ్ల సోషల్​ స్టేటస్​ వివరాలు రాసుకున్నారు. వీళ్లకోసం కోడ్​ వర్డ్స్​కూడా పెట్టుకున్నారు.

  •     టీమ్​ లీడర్​ శ్వేత జైన్​ నుంచి డైరీ స్వాధీనం చేసుకున్నారు.
  •     ‘పంచీ’ అనే కోడ్​ వర్డ్​కి అర్థం ‘ట్రాప్​ చేయాల్సిన ఆఫీసర్​, పొలిటీషియన్,బిజినెస్​మేన్​​’.
  •     ‘మేరా ప్యార్​’ అనే పదానికి అర్థం ‘సెలక్ట్​ చేసిన అమ్మాయి’
  •     ‘వీఐపీ’ అని ఉంటే… ‘హై ప్రొఫైల్​ పొలిటీషియన్​ లేదా టాప్​ ఆఫీసర్​’.
  •     కోడ్​ వర్డ్స్​తోపాటు లవ్​ సింబల్స్​, బాణం గుర్తులతో మెసేజ్​లు
  •     ట్రాప్​ చేయాల్సిన అవసరం, ఆ పని వివరాలు నమోదు
  •     బ్లాక్​మెయిలింగ్​ ద్వారా ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు వసూలు చేశారన్న డేటా

వీళ్లు సామాన్యులు కారు!

శ్వేతా స్వప్నీల్ జైన్ (48) : ఈమె కనుసన్నల్లోనే సెక్స్ స్కాండల్ నడిచినట్లు భావిస్తున్నారు. పొలిటీషియన్లు, ఐఏఎస్ అధికారుల నుంచి డబ్బు వసూలు చేసుకోవడానికి వీలుగా లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ అంటూ ఓ ‘ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో)’ను ఆమె నడిపారు. లేటెస్ట్​గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేయడానికి టికెట్ కోసం ప్రయత్నించారు. బీజేపీతో మంచి కాంటాక్ట్స్​ ఉన్నాయని చెబుతారు. బీజేపీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ ఇంట్లో ఉన్నప్పుడే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

శ్వేతా విజయ్ జైన్ (39): ఈమెకు సొంతంగా ఓ టెక్ ఫర్మ్ ఉంది. ఈ కేసులో అక్యూజ్​డ్​గా ఉన్న ఆర్తి దయాళ్ ఈ ఫర్మ్​లోనే డైరెక్టర్​గా ఉన్నారు. గవర్నమెంట్ కాంట్రాక్టులు సంపాదించడానికి ఈ ఫర్మ్​ను ఉపయోగించుకుంటారన్నది ఆమెపై ఉన్న ఆరోపణ. ఈ ఏడాది జనవరిలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించారు.  ఈ కంపెనీకి కొంతమంది ఐఏఎస్ అధికారుల అండదండలు ఉన్నాయని చెబుతారు. వీటితో పాటు ఒక ఎలెక్ట్రిక్, థర్మల్ ఇన్సులేషన్ ప్రాడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉందంటారు.

ఆర్తి దయాళ్ (29) : ఆర్తి దయాళ్ సొంతూరు ఛాత్రపూర్. శ్వేతా స్వప్నీ ల్ జైన్ ద్ వారా ఈ స్కాం డల్ లో ఇరుక్కుం దన్నది టాక్. ఖాళీ పేపర్ పై పోలీసులు బలవంతం పెట్టి సంతకం చేయించుకున్నారన్నది ఆర్తి దయాళ్ ఆరోపణ.

బర్ఖా సోని (34) : మాజీ కాంగ్రెస్ లీడర్ అమిత్ సోని భార్యే బర్ఖా సోని. కాంగ్రెస్ నాయకులతో ఈమెకు మంచి పరిచయాలు ఉన్నాయని చెబుతారు. శ్వేతా స్వప్నీల్ జైన్​కి బర్ఖా క్లోజ్ ఫ్రెండ్. ప్రముఖులను బ్లాక్​మెయిల్​ చేసి తెచ్చిన సొమ్ముతో ఒక ఎన్జీవో నడుపుతున్నట్లు పోలీసుల ఆరోపణ.

మోనికా యాదవ్ (18) : బీఎస్సీ స్టూడెంట్ అయిన మోనికా యాదవ్ ఈ స్కాండల్​లోని అందరిలోకి చిన్నది. టెన్త్​లో 95 శాతం మార్కులు తెచ్చుకున్న క్లవర్ స్టూడెంట్. కాలేజీ చదువు, ప్రభుత్వ ఉద్యోగం అని ఆశలు పెట్టి ఆమెను భోపాల్​కు తీసుకువచ్చారు. శ్వేత–ఆర్తి టీమ్​ ఈమెను సెక్స్ స్కాండల్ లోనికి దింపినట్లు చెబుతారు. ప్రస్తుతం అప్రూవర్​గా మారాలని నిర్ణయించుకుంది.

సిట్లో పదే పదే మార్పులు

పోయిన నెల 18న హనీ ట్రాప్​ స్కాండల్​పై దర్యాప్తు కోసం వేసిన స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​లో ఇప్పటికి ముగ్గురిని మార్చేశారు. వారం రోజుల్లోనే మార్పులు జరగడంతో దర్యాపుపై జనాల్లో నమ్మకం లేదు.

  • బాధితురాలైన ఒక అమ్మాయి తండ్రి హ్యూమన్​ ట్రాఫికింగ్​ కంప్లయింట్​ చేశారు.
  • ఇండోర్​ హైకోర్టు జోక్యం చేసుకుని అక్టోబర్​ 21లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
  • సీఎం కమల్​నాథ్​ తన అడ్వయిజర్లలో ఒకరైన స్పెషల్​ డీజీ (సైబర్​ సెక్యూరిటీ) పురుషోత్తం శర్మ నాయకత్వంలో స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​ (సిట్​)ఏర్పాటు చేశారు.
  •  గ్యాంగ్​ 5లో ఒకరితో శర్మకు సన్నిహిత సంబంధాలున్నాయని తేలడంతో ఆయనను తప్పించేశారు.
  • శర్మ స్థానంలో అడిషనల్​ డీజీపీ సంజీవ్​ షమీని సిట్​ చీఫ్​గా నియమించారు.
  • మరలా షమీని తప్పించేసి, ఆయన స్థానంలో స్పెషల్​ డీజీ (సైబర్​ క్రైమ్​) రాజేంద్ర కుమార్​ని వేశారు.
  •  తాజా ‘సిట్​’లో రాజేంద్ర కుమార్​, అడిషనల్​ డీజీపీ మిలింద్​ కనస్కర్​, ఇండోర్​ స్పెషల్​ ఎస్పీ రుచివర్ధన్​ మిశ్రా ఉన్నారు.

కిలాడీ వేషాలు

  • శ్వేత- ఆర్తి టీమ్​ ఎలా పనిచేసేదో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే పోలీసులు నోరు వెళ్లబెట్టారు.
  • హనీ ట్రాప్​ చేయడానికి ఈ టీమ్​ లగ్జరీ కార్లను వాడతారు.
  • లాభాపేక్ష లేకుండా ప్రజా సేవ చేస్తామని నాన్​-గవర్నమెంటల్​ ఆర్గనైజేషన్​ (ఎన్జీవో)ను నిర్వహిస్తున్నారు.
  • భోపాల్​, ఇండోర్​ నగరాల్లో టాప్​ర్యాంక్​ పొలిటీషియన్లు, అధికారులతో సన్నిహితంగా తిరిగేవారు.
  • అమ్మాయిల వలలో చిక్కుకున్నవాళ్లకు మంచి హొటళ్లు, రిసార్టుల్లో రూమ్​లు బుక్​ చేస్తారు.
  • ఏకాంత సమయంలో సాగే కార్యకలాపాల్ని రహస్య కెమెరాలతో షూట్​ చేయిస్తారు.
  • నిందితుల్లో ఒకరి భర్త బీజేపీకి చాలా దగ్గరివాడు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా జువెనైల్​ వెల్ఫేర్​ కమిటీలో మెంబరుగా ఎనిమిదేళ్లు పనిచేశాడు.
  • మరో నిందితురాలి భర్త గతంలో రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీలో చురుగ్గా తిరిగేవాడు.
  • శ్వేత టీమ్​లోని ఒక నిందితురాలి ఇంటిలో సోదా చేస్తే హనీ ట్రాప్​కి సంబంధించిన హార్డ్​ డ్రైవ్​, పెన్​ డ్రైవ్​లు దొరికాయి.
  • మరో నిందితురాలు​ పోలీసుల్ని చూసి కళ్లు తిరిగి పడిపోయింది. తాను గర్భవతినని చెప్పడంతో హాస్పిటల్​కి తీసుకెళ్లారు. అక్కడి వైద్య పరీక్షలో ఆమె ప్రెగ్నెంట్​ కాదని తేలింది.
  • సోదాల్లో రెండు లాప్​టాప్​లు, మొబైల్​ ఫోన్లు, 92 హైక్వాలిటీ వీడియో క్లిప్పులు దొరికాయి.