దేవుడి గుడి ఉంటే రోజు ఉదయం.. సాయంత్రం పూజలు.. ధూప, దీప.. నైవేద్యాలు సమర్పిస్తుంటారు. సాధారణంగా ప్రతి దేవాలయంలో అర్చకులు అన్నం వండి నైవేద్యం సమర్పిస్తారు. భక్తులు.. టెంకాయ, పండ్లు లాంటివి తెచ్చి స్వామి వారికి నివేదన పెడతారు. కాని దేశంలో ఓ దేవాలయం ఏడాదికి ఒక్క రోజే తెరుస్తారట. ఆరోజే పూజలు.. నైవేద్యాలు.. ఇంతకూ ఆ దేవాలయంలోని దేవుడెవరు.. ఆ గుడి ఎక్కడ ఉంది.. ఆ దేవాలయాన్ని ఏరోజు తెరుస్తారో తెలుసుకుందాం.. .
మహాశివరాత్రి రోజున శివుడిని ఎంతో నిష్టగా భక్తి శ్రద్దలతో పూజిస్తారు. మహాశివరాత్రి రోజు శివ భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. పరమశివుడిని దర్శించుకునేందుకు శివాలయాలకు కుటుంబ సమేతంగా తరలివెళ్తారు. అయితే సాధారణంగా అన్ని ఆలయాలు ఓ ప్రత్యేక సమయం వరకు తెరచే ఉంటాయి. కానీ, మధ్యప్రదేశ్‌లో ఉన్న ఓ ఆలయం శివరాత్రి రోజు మాత్రమే తెరుచుకుంటుందట.
మధ్యప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ శివాలయం విశిష్టత వెలుగులోకి వచ్చింది.దశాబ్దాలుగా మూసివేసిన ఆలయాన్ని కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు.సోమేశ్వరాలయంగా పిలువబడే ఈ దేవాలయం భూపాల్ కు 48 కిలో మీటర్ల దూరంలో ఉంది.1000 అడుగుల ఎత్తైన కొండ పై ఈ ఆలయం ఉంది.పదవ శతాబ్ధంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.1283వ సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.ఆ తర్వాత మాలిక్ కపూర్, మహమ్మద్ షా తుగ్లక్, సాహిబ్ ఖాన్లు సోమేశ్వరాలయాన్ని ఆక్రమించుకున్నారు.1543లో షేర్షా సూరి ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
ALSO READ :- Charan, Vijay: యూవీ ప్రాజెక్ట్ నుండి చరణ్ ఔట్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన రౌడీ హీరో
సామాన్య ప్రజల కోసం ఈ దేవాలయాన్ని తెరవాలని 1974లో ఉద్యమం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ సోమేశ్వర ఆలయానికి తాళం తీసి సామాన్య ప్రజలు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే కేవలం శివరాత్రి రోజు మాత్రమే ఈ దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు అనుమతిని ఇచ్చారు.ప్రస్తుతం ఈ దేవాలయాన్ని పురావస్తు శాఖ నిర్వహిస్తుంది.మహా శివరాత్రి రోజు 12 గంటల పాటు అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు