- ప్రస్తుతం 228/6
నాగ్‌పూర్: విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్‌లో మధ్యప్రదేశ్ ఛేజింగ్‌లో తడబడింది. ఓపెనర్ యష్ దూబే (94), హర్ష్ గ్వాలి (67) పోరాడినా.. చివర్లో చకచకా వికెట్లు తీసిన విదర్భ గెలుపు దిశగా సాగుతోంది. 321 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 228/6 స్కోరు చేసింది. ఆట ముగిసే టైమ్‌కు సారాన్ష్ జైన్ (16 బ్యాటింగ్), కుమార్ కార్తికేయ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఎంపీ విజయానికి మరో 93 రన్స్ అవసరం కాగా, చేతిలో నాలుగే వికెట్లు ఉన్నాయి. హిమాన్షు మంత్రి (8), సాగర్ సోలంకి (12), శుభమ్ శర్మ (6), వెంకటేశ్ అయ్యర్ (19) ఫెయిలయ్యారు. అంతకుముందు 343/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 101.3 ఓవర్లలో 402 రన్స్‌కు ఆలౌటైంది. యష్ రాథోడ్ (141) భారీ సెంచరీ సాధించాడు. అనుభవ్ అగర్వాల్ 5, కుల్వంత్, కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు.