హైదరాబాద్, వెలుగు: తమ రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణల గురించి వివరించడానికి "గ్రీన్, క్లీన్ అండ్ సేఫ్ మధ్యప్రదేశ్" అనే థీమ్‌తో మధ్యప్రదేశ్ (ఎంపీ) టూరిజం బోర్డు హైదరాబాద్‌లో గురువారం రోడ్‌షో నిర్వహించింది. తమ రాష్ట్రం అందిస్తున్న ఆఫర్లను ప్రదర్శించింది. తమ రాష్ట్రంలో ఎన్నో చరిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని, వాటిలో కొన్నింటికి యునెస్కో హెరిటేజ్ సైట్లుగా గుర్తింపు వచ్చిందని తెలిపింది.
పులులకు, చీతాలకు, ఇతర ఎన్నో అరుదైన వన్యప్రాణులకు తమ రాష్ట్రం నెలవని ప్రకటించింది. గత ఏడాది ఎంపీని 11 కోట్ల మందికిపైగా సందర్శించారని తెలిపింది.