భోపాల్: తనపై మూత్రం పోసిన ప్రవేశ్ శుక్లాను రిలీజ్ చేయాలని మధ్యప్రదేశ్ సర్కారును ఆదివాసి యువకుడు దశ్మత్ రావత్ కోరారు. చేసిన పనికి నిందితుడు సిగ్గుపడుతున్నాడని.. తన తప్పు తెలుసుకున్నందున అతడిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడు ప్రవేశ్ శుక్లా తమ ఊరికి చెందిన పండిట్ అని తెలిపారు. తమ గ్రామానికి రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న రాహుల్.. వెంటనే రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దశ్మత్ రావత్‌పై ప్రవేశ్ శుక్లా మూత్రం పోశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ కావడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర దుమారం నెలకొంది. దాంతో బుధవారం నిందితుడు ప్రవేశ్ శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడైన ఆదివాసి యువకుడిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఇంటికి పిలిపించుకుని స్వయంగా అతడి కాళ్లు కడిగి.. క్షమాపణలు కూడా చెప్పారు.