ప్రస్తుతం బయట ఏ ఆహార పదార్థం తిందామనుకున్న కల్తీ ఎక్కువైపోయింది. ఇంటినుంచి బయటకు వెళ్లి ఏదైనా నచ్చిన ఐటెం తిందామంటే తినబోయే ఐటెంలో ఏదో ఒక వస్తువు రావడం సర్వసాధారణం అయిపోయింది. బయట ఏమైనా తిందామంటే చిత్ర విచిత్రాలు అన్నీ జరుగుతున్నాయి.. మొన్నటికి మొన్న ఐస్ క్రీంలో చేతి వేలు వచ్చింది.. ఇప్పుడు చాక్లెట్ లో ఏకంగా దంతాల సెట్టు వచ్చింది.. చాక్లెట్లలో పురుగులు రావటం కామన్.. అందుకు భిన్నంగా ఈసారి ఏకంగా దంతాల సెట్ వచ్చింది.. ఈ విడ్డూరం ఎక్కడో కాదు.. మన దేశంలోనే.. మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..తాజాగా చాక్లెట్‌లో ఏకంగా నాలుగు పళ్లతో కూడిన సెట్ రావడం కలకలం రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో చోటుచేసుకుంది. రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మాయాదేవి ఓ చాక్లెట్ ప్యాకెట్ ను తెరచి చూడగా పళ్ల సెట్ కనిపించడంతో షాక్ అయింది. ఆమె ఒక ప్రభుత్వేతర సంస్థలో వాలంటీర్‌గా పని చేస్తున్నారు. అక్కడ ఆమె పిల్లల పుట్టినరోజున ఓ చాక్లెట్‌ను తీసుకున్నారు. బాధితురాలు దీనికి సంబంధించిన ఫోటోను.. తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆమె కొద్దిరోజుల క్రితం తమ సంస్థలోని పిల్లాడి పుట్టిన రోజు సందర్భంగా చాక్లెట్ అందుకున్నారు. దాన్ని తాజాగా తినేందుకు ప్రయత్నించగా ఆమె నోట్లోకి ఏదో గట్టిగా తగిలింది. ముందుగా చాక్లెట్ గట్టిగా ఉందేమో అనుకుని మరోసారి నమిలేందుకు ప్రయత్నించింది. కానీ.. అది పంటి కింద నలగలేదు. దాంతో.. ఒక్కసారిగా బయటకు తీయడంతో.. వాటిని చూసి షాక్ తిన్నది.
నాలుగు దంతాల సెట్‌ను చూసి ఆందోళనకు గురైనట్లు మాయాదేవి చెప్పింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మాయాదేవి ఖర్గోన్‌లోని జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ బృందాన్ని ఏర్పాటు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి హెచ్‌ఎల్ అవాసియా తెలిపారు. దర్యాప్తు బృందం చాక్లెట్లు కొనుగోలు చేసిన దుకాణం నుండి నమూనాలను తీసుకుంది. అలాగే మహిళ వద్ద ఉన్న చాక్లెట్ నమూనాలను ప్రయోగశాలకు పంపించినట్లు దర్యాప్తు బృందం తెలిపింది.