మధ్యప్రదేశ్ ఝబువా జిల్లాలోని దేవీగఢ్ గ్రామంలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుని కూడా.. మరో కులం వ్యక్తిని ప్రేమించి నేరం చేసిందన్న ఉద్దేశంతో… ఓ వివాహితకు దారుణమైన శిక్ష వేశారు ఆ ఊరి పెద్దలు.
గ్రామంలోని 27 మహిళ…. భర్తను వదిలేసి.. ఇంట్లోనుంచి పారిపోయింది. ప్రేమించిన మరో యువకుడితో కలిసి గుజరాత్ కు ఇటీవల వెళ్లిపోయింది. భర్త, బంధువులు వెతికి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఊరికి తీసుకు వచ్చినప్పుడు.. తప్పుచేశావంటూ ఆమెను ఓ పది .. 15 మంది హింసించారు. ఒంటిపై దుపట్టా లాగారు. పంచాయతీ పెట్టి ఆమెకు శిక్ష వేశారు. భర్తను ఎత్తుకుని నడిచి.. ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు.
అలా.. భర్తను భుజంపై ఎత్తుకుని.. ఆమె చాలాదూరం నడిచింది. ఆమె భర్తను ఎత్తుకుని నడుస్తున్నప్పుడు.. పక్కనున్న వాళ్లు ఆమెను తిడుతూ.. కర్రతో కాళ్లపై కొడుతూ శిక్షించారు. ఓ ముసలాయన ముందు డాన్స్ చేస్తూ… సంబురపడ్డాడు. భర్తను భుజాలపై మోస్తూ నడుస్తున్నప్పుడు ఆమె తీవ్రంగా ఇబ్బందిపడింది.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఎంక్వైరీ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇలాంటి సంఘటనలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని… ఇలాంటివి మళ్లీ జరక్కుండా చూస్తామని పోలీసులు చెప్పారు. కేసు పెట్టిన పోలీసులు… నిందితులకు, గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు చెప్పారు.