మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) అనారోగ్యంతో కన్నుమూశారు. శ్వాససంబంధ వ్యాధితో కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల జూన్ 11 నుంచి ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అశుతోష్ టాండన్ ట్వీట్ చేశారు. లాల్జీ టాండన్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 22వ గవర్నర్ పనిచేస్తున్నారు. ఏప్రిల్ 12, 1935న లక్నోలో జన్మించిన టాండన్.. బీజేపీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆయన గతంలో బీహార్ కు కూడా గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
For More News..