
- ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించిన రేవంత్‌రెడ్డిని తిడుతూ.. చంద్రబాబును పొగడడం ఏమిటి?
- మాదిగ దండోర వ్యవస్థాపక అధ్యక్షుడు సతీశ్ మాదిగ ఫైర్
ఖైరతాబాద్, వెలుగు: 30 ఏండ్ల వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపిన సీఎం రేవంత్ రెడ్డిని, వెనుక ఉండి నడిపించిన మంత్రి దామోదర రాజనర్సింహను మందకృష్ణ మాదిగ ఎలా విమర్శిస్తారని మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు దేవని సతీశ్ మాదిగ ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ తొలి ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సతీశ్ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని తిడుతూ.. ఆంధ్రా సీఎం చంద్రబాబును మందకృష్ణ పొగుడుతున్నాడంటే మళ్లీ తెలంగాణలో టీడీపీని బలపరిచేందుకే అని ఆరోపించారు. మాదిగలు ఎన్నడూ బీజేపీకి అండగా ఉండబోరని ఆయన స్పష్టంచేశారు.