వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్. ప్రొఫెసర్ కాసిం వెంకటేష్, తదితరులు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందేవిధంగా చర్యలు తీసుకున్నారని మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు తెలిపారు. అసెంబ్లీలో వర్గీకరణ బిల్లునుప్రవేశ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం ఆరేపల్లి రాజేందర్, ప్రొఫెసర్ కాసిం వెంకటేష్, తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
సోమాజీగూడ ప్రెసిక్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడతూ... దళితుల్లోని అన్ని ఉపకులాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతోనే మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం జరిపారన్నారు. ఏళ్ల తరబడి సాగిన పోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఇచ్చిన తీర్పుతో అడ్డంకి తొలగిందని అన్నారు. ఆగస్టు ఒకటిన తీర్పు వెలువడిన మొదటి రోజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read :- నిజాంపేట మెయిన్ రోడ్డు హైడ్రా కూల్చివేతలు
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియలను కొనసాగింపుగా జస్టిస్ షమీమ్ ఆక్తర్ నేతృతంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వాటన్నిటిని అధిగమించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆమోదం పొంది బిల్లు చట్ట రూపం దాల్చే ప్రక్రియ మిగిలే ఉందని అన్నారు. వారం రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి కార్యరూపం తీసుకురావాలని అన్నారు. తక్షణమే జీవోను తీసుకొచ్చి ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్ లకి గ్రూప్ 1, గ్రూప్ 2 వర్గీకరణ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.