
హైదరాబాద్, వెలుగు: మాదిగలకు12శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 7 నుంచి జరుగుతున్న మాదిగల జనసభను జయప్రదం చేయాలని మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. ఈ జనసభల పోస్టర్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వక్కలగడ్డ చంద్రశేఖర్, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డే యాదయ్య, మల్లికార్జున్ పాల్గొన్నారు.