మాదిగల విశ్వరూప మహాసభను సక్సెస్​ చేయాలి : సోమశేఖర్

బోధన్​,వెలుగు : హైదరాబాద్ లో నిర్వహించే మాదిగల విశ్వరూప మహాసభకు మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు సీహెచ్ సోమశేఖర్ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం సాలూర మండల కేంద్రంలోని దండోరా కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన సమావేశంలో సోమశేఖర్​ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో అతి తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాలకి రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు.  

మాదిగ ఉపకులాలకు విద్య, వైద్య రంగాలలో ఉద్యోగ రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. అనంతరం  సాలూర నూతన మండల ఇంచార్జిగా ధమ్మన్ గావ్ సుభాష్, కో కన్వీనర్ గా మొండూరి అశోక్ ను నియమించారు.  ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ గోనెవర్ మారుతి మాదిగ, జిల్లా నాయకులు లింబూరి లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ బోధన్ ఉమ్మడి  మండల ఇన్​చార్జి బూరె శంకర్, ఎమ్మార్పీఎస్ బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జి  సోంపూర్ పోచీరం పాల్గొన్నారు.