- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి మాల సామాజికవర్గ నేతల ఒత్తిడికి లొంగి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాడని ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని, దీనివల్ల మాదిగ బిడ్డల నోటికాడి కూడు లాక్కున్నట్టయ్యిందని మండిపడ్డారు.
వర్గీకరణ అమలు చేయకుండా టీచర్పోస్టులను భర్తీ చేసినందుకు నిరసనగా అన్ని జిల్లాల్లో ఈనెల 25 నుంచి 31 వరకు ‘మాదిగల ధర్మయుద్ధ మహాసభలు’ నిర్వహిస్తామని, నవంబరు 4 నుంచి 14 వరకు 119 నియోజక వర్గాల్లో మాదిగల ధర్మయుద్ధ దీక్షలు, నవంబరు 16 నుంచి డిసెంబరు 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల ధర్మయుద్ధ రథయాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు.