విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మార్క్‌ ఆంటోనీ సినిమాపై బ్యాన్‌

విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మార్క్‌ ఆంటోనీ సినిమాపై బ్యాన్‌

తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మార్క్‌ ఆంటోనీ(Mark Antony) సినిమాపై బ్యాన్‌ విధిస్తూ షాకిచ్చింది మద్రాస్ హైకోర్టు. విడుదలకు వారం రోజుల ముందు కోర్టు సినిమాపై బ్యాన్ విధించడంతో షాకవుతున్నారు మేకర్స్.

ALSO READ :ఇండియా పేరు మారిస్తే.. కమల్ సినిమా పరిస్థితేంటి?

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. గతంలో హీరో  విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ.. గోపురం ఫిల్మ్స్ రూ.21.29 కోట్ల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. ఆ అమౌంట్ ను విశాల్ తిరిగి చెల్లించకపోవడంతో.. విశాల్‌ను నమ్మి ఆ మొత్తాన్ని లైకా ప్రొడక్షన్‌ చెల్లించింది. ఈ విషయంలో విశాల్, లైకా మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే.. విశాల్ ఆ అమౌంట్ తిరిగి చెల్లించేవరకు ఆయన సొంత సంస్థ నుండి వచ్చే అన్ని చిత్రాల హక్కులను లైకాకు ఇవ్వాలని ఒప్పందం రాసుకున్నారు.  

కానీ విశాల్ హీరోగా వచ్చిన సామాన్యుడు సినిమాను లేకాకు ఇవ్వలేదు. దీంతో ఆ సినిమాపై నిషేధం విధించాలని మద్రాసు హైకోర్టులో కేసు వేసింది లైకా సంస్థ. దీంతో..  హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట 15 కోట్ల రూపాయలను శాశ్వత డిపాజిట్‌ చేసి ఆస్తుల వివరాలను సమర్పించాలని నటుడు విశాల్‌ను ఆదేశించింది. ఆ రూ.15 కోట్లు కూడా డిపాజిట్ కాకపోవడంతో ఆ కేసు ఇప్పుడు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆశా వద్దకు విచారణకు వచ్చింది. ఈ మేరకు విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కోర్టు.