చిన్నశంకరంపేట, వెలుగు : తమ గ్రామ శివారులో వైన్స్ ఏర్పాటు చేయొద్దంటూ చిన్నశంకరంపేట మండలం మడూర్గ్రామ మహిళలు గురువారం జీపీ ఆఫీస్ వద్ద ఆందోళన నిర్వహిచారు. మండలంలోని గవలపల్లి గ్రామంలో ఉన్న వైన్స్‌ను అక్కడి నుంచి తీసి మడూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో మధ్య నిషేధం అమలులో ఉండగా ఇప్పుడు వైన్స్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.
దీనివల్ల గ్రామంలోని యువత మద్యం తాగి జీవితాలను నాశనం చేసుకునే ప్రమాదం ఉందని, మద్యం మత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎక్సైజ్ ఆఫీసర్లు స్పందించి తమ గ్రామ పరిధిలో వైన్స్ ఏర్పాటు చేయకుండా చూడాలని కోరారు. ఆందోళనలో నర్సమ్మ, సుజాత, అనురాధ, యాదమ్మ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.