ఓ మహిళా క్రికెటర్ తన ఫీల్డింగ్ ప్రదర్శనతో యావత్ పురుష క్రికెటర్లనూ ఆశ్చర్యపరిచింది. క్యాచ్ అందుకోవాలనే ఆమె తపన, గాల్లోకి ఎగిరిన తీరు జాంటీ రోడ్స్, యువరాజ్ సింగ్ వంటి దిగ్గజ క్రికెటర్లను సైతం ప్రశంసించేలా చేసింది. ది హండ్రెడ్ ఉమెన్స్ లీగ్‌లో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ మ్యాడీ విలియర్స్ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. పక్షిలాగా అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ ఒడిసి పట్టుకుంది.
నాటింగ్‌హామ్ వేదికగా బుధవారం (ఆగస్టు 14) ట్రెంట్ రాకెట్స్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడుతున్న మ్యాడీ.. ట్రెంట్ రాకెట్స్ బ్యాటర్ బ్రయోనీ స్మిత్ కొట్టిన ఓ బంతిని అద్భుతంగా గాల్లోకి డైవ్ చేసి అందుకుంది. 25 ఏళ్ల మ్యాడీ ఫీల్డింగ్ చూసి సహచర క్రీడాకారిణీలే కాదు, ప్రత్యర్థి జట్టు డగౌట్లో కూర్చున్న వారు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు. ఆమెను ప్రశంసిస్తూ చప్పట్లు కొట్టారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
😱 A one-handed catch! 😱
— The Hundred (@thehundred) August 14, 2024
How good from Mady Villiers?! 🙇#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/eCBhW2k9ha
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే, ఓవల్ ఇన్విన్సిబుల్స్ 5 వికెట్ల తేడాతో ట్రెంట్ రాకెట్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ 91 పరుగులు చేయగా.. ఓవల్ 5 వికెట్లు కోల్పోయి, మరో 6 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది.