OTT MOVIES : మాఫియా ముఠా v/s సైబర్​ ఎక్స్​పర్ట్

OTT MOVIES : మాఫియా ముఠా v/s సైబర్​ ఎక్స్​పర్ట్

పెద్దమ్మాయి పెండ్లి

టైటిల్        :     ఉప్పు పులి కారమ్
లాంగ్వేజ్   :     తమిళం
ప్లాట్​ ఫాం   :     డిస్నీ ప్లస్ హాట్ స్టార్
డైరెక్షన్      :     ఎం. రమేశ్ భారతి
కాస్ట్             :     అశ్విని ఆనందిత, వనిత కృష్ణ చంద్రన్, రాజ్ అయ్యప్ప, నవీన్ కుమార్, ఎం. ఫరీనా అజాద్, దీపక్ పరమేశ్, కృష్ణ, పొన్వన్నన్, దీపికా వెంకటాచలం,  ఆయేషా జీనత్

సుబ్రమణి ఒక హోటల్ ఓనర్. అతని భార్య​ సుబ్బు. వీళ్లకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. పెద్దమ్మాయి చిన్మయికి పెండ్లి చేయాలి అనుకుంటారు. ఆ అమ్మాయి లాయర్. ఆమె మాజీ లవర్ శివ టీవీ ఛానెల్​ డైరెక్టర్. కోర్టు విషయాల్లో అప్పుడప్పుడు ఈ ఇద్దరూ కలుస్తుంటారు. అలా కలవడం వల్ల  గతం వాళ్లని వెంటాడుతుంటుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ ఇద్దరూ ఒక్కటయ్యారా? తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. మధ్యతరగతి తల్లిదండ్రులు​గా సీనియర్ నటులు తమ పాత్రల్లో జీవించారు. పెద్ద కూతురి పాత్రలో చేసిన ఆయేషా జీనత్​ స్క్రీన్​ మీద చాలా బాగుంది. ఇది కొరియన్ షో ‘మై  ఫాదర్ ఈజ్ స్ట్రేంజ్​’ నుంచి తీసుకున్న కథ. 

ఆ భూమి చేతికొచ్చిందా?

టైటిల్           :    దేఢ్ భిగా జమీన్​
లాంగ్వేజ్     :     హిందీ
ప్లాట్​ ఫాం     :     జియో సినిమా
డైరెక్షన్         :     పుల్​కిత్
కాస్ట్                :     ప్రసన్న బిష్ట్​, ప్రతీక్ గాంధీ, దీపేశ్​ సుమిత్ర జగ్​దీశ్, దుర్గేశ్ కుమార్, కుషాలీ కుమార్, మృత్యుంజయ్ పాండే,  వికాస్ శర్మ

అనిల్ సింగ్​గా ప్రతీక్ గాంధీ మెయిన్​ రోల్​ చేసిన ఈ సినిమా... అతని చెల్లి పెండ్లి ఏర్పాట్లతో మొదలవుతుంది. పెండ్లికి ముందే వరకట్నం తన చేతిలో పడాలని పెండ్లి కొడుకు తండ్రి డిమాండ్​ చేస్తాడు. అనిల్​​ తండ్రికి కొంత భూమి ఉంటుంది. దాన్ని అమ్మితే ఎటువంటి అడ్డంకులు లేకుండా చెల్లి పెండ్లి జరిగిపోతుంది. అందుకని అనిల్​​ ఆ భూమిని అమ్మడానికి ట్రై చేస్తుంటాడు. ఆ క్రమంలో రకరకాల సమస్యలు ఎదురవుతాయి. భూమి అమ్మడం అనే ప్రాసెస్​ కష్టంగా ఉండటమే కాకుండా  అనిల్​ ఓపికకు పరీక్ష పెడుతుంటుంది. దేడ్​ భిగా జమీన్​ కథ లెజెండ్​ దిలీప్​కుమార్​ కాలం నాటిది లేదా ఆ కాలం నాటి టీవీ సిరీస్​లా​ అనిపిస్తుంది. సినిమాల్లో, టీవీ సిరీస్​ల్లో మీరు ఇంతవరకు  చూడని స్క్రీన్​ప్లే ఇందులో కనిపిస్తుంది. అనిల్​ తల్లిగా నీతా మొహింద్రా, భార్య పూజ రోల్​లో కుషాలీ కుమార్, చెల్లెలు నేహగా (ప్రసన్న బిష్ట్) చేశారు. ఇంతకీ భూమి అనిల్​కి వచ్చిందా? చెల్లి పెండ్లి జరిగిందా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇందులో పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలేవీ ఉండవు. ఒక మంచి మనిషికి, దుర్మార్గుడికి మధ్య జరిగే న్యాయ పోరాటం. ఇది ఓ సామాన్యుడి కథ. 

మర్డర్​కి, క్రిప్టో కరెన్సీకి సంబంధం ఏంటి?

టైటిల్         :     హౌస్ ఆఫ్​ లైస్ సీజన్ – 1
లాంగ్వేజ్    :     హిందీ
ప్లాట్​ ఫాం    :     అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్       :     సౌమిత్ర సింగ్
కాస్ట్             :     సంజయ్ కపూర్, రితురాజ్ సింగ్, సిమ్రాన్​ కౌర్, అజితేష్​ గుప్తా

ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. అనగానే భలే ఇంట్రెస్టింగ్​గా ఉంది అనిపిస్తుంది. కథలోకి వెళ్తే... ఆల్బర్ట్​ పింటో (రితురాజ్ సింగ్) మర్డర్​ కేస్​ని పోలీస్​ ఆఫీసర్స్ రాజీవ్ చౌదరి (సంజయ్ కపూర్), శశి (సిమ్రాన్ కౌర్ సూరి) కలిసి ఇన్వెస్టిగేషన్​ చేస్తుంటారు. అయితే, అందులో దొరికిన ‘క్లూ’ ప్రకారం, ఒకరు మర్డర్​ కేస్​ని సాల్వ్ చేస్తుండగా, మరొకరు పోగొట్టుకున్న కోట్ల విలువ చేసే క్రిప్టో కరెన్సీ గురించి ఫోకస్ చేస్తారు. ఇంతకీ ఆ మర్డర్​కి, క్రిప్టో కరెన్సీకి ఉన్న సంబంధం ఏంటి? అసలు మర్డర్ ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? వంటి విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాలి. ఈ క్రైమ్​ స్టోరీలోని క్యారెక్టర్స్​కి ఒకదానితో ఒకటి కెమిస్ట్రీ అంతగా కుదిరినట్టు లేదు.

ఫేమస్ అవ్వాలని..

టైటిల్        :     గీక్ గర్ల్
లాంగ్వేజ్   :     హిందీ, ఇంగ్లిష్​
ప్లాట్​ ఫాం    :     నెట్​ఫ్లిక్స్
డైరెక్షన్      :     జెస్సికా రుస్టన్, హోలీ స్మేల్
కాస్ట్             :     ఎమిలీ కేరీ, లియామ్ వుడ్రమ్, డైసీ జెల్లే, సారా పారిష్​, శాండ్రా, టిమ్ డౌనీ, జెమిమా రూపర్, ఇమ్మాన్యుయేల్ ఇమాని

హారియెట్ మ్యానర్స్ (ఎమిలీ కేరీ)ని స్కూల్లో స్టూడెంట్స్ ‘గీక్’ అనే పేరుతో పిలుస్తుంటారు. గీక్ అనగానే ఆమె గుర్తొచ్చేస్తుంది. హారియెట్​కి అందరూ తనను గుర్తించడాన్ని, పొగడడాన్ని చాలా ఇష్టపడుతుంది. ఆ ఐడెంటిటీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. అందులో భాగంగా లండన్​లోని ఫ్యాషన్​ వీక్ ట్రిప్​కి వెళ్లొచ్చాక తన లైఫ్​లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత మోడలింగ్ ఏజెన్సీ తనతో కాంట్రాక్ట్​ సైన్ చేయించుకోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది? తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. టీనేజ్​లో ఉండే క్రష్​లు, ఎంజాయ్​మెంట్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. పది ఎపిసోడ్ల సిరీస్​ అయినా బోర్ కొట్టదు. ఎమిలీ నటన ఈ​ సిరీస్​ని  నెక్స్ట్ లెవల్​కి తీసుకెళ్తుంది. 

ఓ లాయర్​.. అంతరంగ సంఘర్షణ

టైటిల్        :     ఇల్లీగల్ సీజన్ 3
లాంగ్వేజ్   :      హిందీ
ప్లాట్​ ఫాం   :      జియో సినిమా
డైరెక్షన్      :       సాహిర్ రజా
కాస్ట్            :       నేహా శర్మ, పీయూష్​ మిశ్రా, అక్షయ్ ఒబెరాయ్, సత్యదీప్ మిశ్రా, నీల్ భూపాలం, జయిన్ మేరీ ఖాన్, ఆషీమా వర్ధన్

నిహారిక సింగ్ (నేహా శర్మ) డెడికేటెడ్ లాయర్. కాకపోతే పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్​లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయినప్పుడు ఆమెకు పరీక్షలా ఉంటుంది. ఆ పరిస్థితులని నిహారిక ఎలా హ్యాండిల్ చేసింది అనేది స్టోరీ. ఈ కథ ఎంత ఎంగేజింగ్​గా ఉందో దానికి తగ్గట్టే మిగతా స్టోరీలు కూడా సపోర్ట్ చేశాయి. చట్టపరమైన అంశాలు, వ్యక్తిగత సమస్యలతో డీల్ చేయడం చక్కగా చూపించారు. ఈ సీజన్​లో నిహారిక కొలీగ్ పునీత్ (సత్యదీప్ మిశ్రా) కనిపిస్తాడు. దాంతోపాటు అక్షయ్​ (అక్షయ్​ ఒబెరాయ్) క్యారెక్టర్ రావడంతో ఎమోషనల్ పర్సంటేజ్​ పెరుగుతుంది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎవరు? నిహారిక ఎటువంటి విషయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? వాటిని తనెలా డీల్ చేసింది? వంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తం​గా ఈ లీగల్ డ్రామా చూడడానికి బాగుంటుంది. 

మాఫియా ముఠా v/s సైబర్​ ఎక్స్​పర్ట్

టైటిల్          :     కీచురాళ్లు
లాంగ్వేజ్     :     మలయాళం, తెలుగు
ప్లాట్​ ఫాం     :     ఈటీవీ విన్
డైరెక్షన్         :     రాహుల్ రిజీ నాయర్
కాస్ట్               :     రజీషా విజయన్, శ్రీనివాసన్, విజయ్ బాబు, మణికందన్

రాధిక (రజీషా విజయన్) సైబర్ సెక్యూరిటీ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తుంటుంది. కొన్ని కేసులు సాల్వ్ చేయడానికి పోలీస్ డిపార్ట్​మెంట్​ ఆమె సాయం తీసుకుంటుంటారు. రాధిక తండ్రి సీనియర్ లాయర్. ఇంట్లో వాళ్లిద్దరే ఉంటారు. ఫ్రిజ్​ రిపేర్ కోసం ఒక నెంబర్​కి కాల్ చేస్తుంది. అది రాంగ్ నెంబర్ అని తెలిసి ఫోన్ కట్ చేస్తుంది. అయితే, ఆ నెంబర్​ కిలి బిజూ అనే అతనిది. అతను మాఫియా ముఠాకి సంబంధించిన లోకల్ గ్యాంగ్​లో ఒకడు. ఆ గ్యాంగ్​లో ఉండే ఐదుగురు స్క్రాప్​ బిజినెస్ చేస్తున్నట్టు ఆ ప్రాంత ప్రజలను నమ్మిస్తుంటారు. రాధిక ఫోన్​ చేసినప్పుడు కిలి బిజూకి ఆమె వాయిస్ నచ్చడంతో మళ్లీ తనతో మాట్లాడాలి అనుకుంటాడు. ఆమె గురించి తెలుసుకుని వేధిస్తుంటాడు. పోలీసులకు విషయం తెలిసి పిలిచి మందలిస్తారు. కానీ ఆ తరువాత వాళ్లు ఇంకా రెచ్చిపోతారు. రాధికకి వాళ్ల నిజస్వరూపం తెలుస్తుందా? తెలిస్తే ఎలా తెలుసుకోగలిగింది? వాళ్లకెలా బుద్ధి చెప్పింది? అనేది మిగతా కథ. కథంతా హీరోయిన్​ చుట్టూరా నడుస్తుంది. రజీషా పర్ఫార్మెన్స్​ బాగుంది.