హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో ఇద్దరు రియల్టర్ల కాల్చివేత ఘటన, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కుట్రను ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నదని ప్రశ్నించారు. ఆధిపత్య వర్గాలు బహుజనుల సంపదను గుంజుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారని ఆరోపించారు. కానీ ‘మంచి’ పోస్టింగులకు బానిసలైన పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు.. సామాన్యుల ఆస్తులను కాపాడాల్సిందిపోయి అధికార పార్టీ, మాఫియాతో చేతులు కలిపారని విమర్శించారు. ప్రజల ఓట్లు కొల్లగొట్టడానికి కోట్ల డబ్బులు ఈ దందాల నుంచే వస్తాయని చెప్పారు. అందుకే ఈసారి ఏనుగుకు ఓటేయాలని కోరారు. తద్వారా మాఫియాల టీఆర్ఎస్, బీజేపీలను తెలంగాణ నుంచి తరిమేద్దామని ట్వీట్ చేశారు.
1.మొన్న ఇబ్రహీంపట్నంలో పట్టపగలే ఇద్దరు రియాల్టర్ల కాల్చివేత, నిన్న సాక్షాత్తు ఒక మంత్రినే చంపడానికి సుపారి! ఇందుకోసమేనా మనం #Telangana తెచ్చుకున్నది? ఆధిపత్య వర్గాలు మన బహుజన సంపదను గుంజుకోవడానికి ఎంతకైనా తెగిస్తై. ‘మంచి’ పోస్టింగులకు బానిసలైన పోలీసు-రెవిన్యూ వ్యవస్థలు…
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) March 3, 2022
మరిన్ని వార్తల కోసం: