
ప్రధాని మోదీ రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకొని ఇండియా పయనమయ్యారు. అంతకుముందు వైట్ హౌజ్ లో ప్రధానిమోదీ, ట్రంప్ భేటీ అయ్యారు. ఇరుదేశాల అభివృద్ధి లక్ష్యంగా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ట్రంప్ తో భేటీలో ప్రధాని మోదీ MIGA +MAGA=MEGA పార్టినర్ షిప్ ను ప్రతిపాదిం చారు. అసలు MIGA +MAGA=MEGA అంటే ఏమిటి..ఎందుకు మోదీ ఈ ఈక్వేషన్ ను వాడారో చూద్దాం.
ట్రంప్ తో మీటింగ్ లో ప్రధాని మోదీమాట్లాడుతూ.. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)అనే నినాదంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు..అదేవిధంగా మేక్ ఇండియా గ్రేట్ ఎగై న్ (MIGA)నినాదంతో ఇండియా వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. MIGA, MAGA కలిసి ఇరుదేశాల శ్రేయస్సుకోసం మెగా(MEGA) భాగస్వామ్యంలో పనిచేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
గురువారం (ఫిబ్రవరి 14) అమెరికా వైట్ హౌజ్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, ఇంధనం, రక్షణతో సహా పలు రంగాల్లో బలోపేతం కోసం పలు ఒప్పందాలు చేసుకున్నారు. 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు వాణిజ్యం చేరుకోవాలని దేశాల నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్వేచ్చాయుత వాణిజ్యం, వలసలు, ఇండోపసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితి వంటి భౌగోళిక రాజకీయ అంశాలపై రెండు దేశాల ఐక్యతను బలోపేతం చేశారు. ప్రపంచశాంతి, ప్రపంచ ఉగ్రవాదంపై పోరాటంలో సహకరించుకోవాలని ఇందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.