కామారెడ్డిలో పలు ఆలయాల్లో భక్తుల రద్దీ

కామారెడ్డిలో  పలు  ఆలయాల్లో భక్తుల రద్దీ
  • మాఘ అమావాస్య సందర్భంగా పూజలు

తాడ్వాయి, ఎల్లారెడ్డి, వెలుగు:  కామారెడ్డిలోని  పలు ఆలయాల్లో  బుధవారం మాఘ మాస అమావాస్య  సందర్భంగా  భక్తుల సందడి నెలకొంది.   తాడ్వాయి మండలం సంతాయిపేట సమీపంలోని భీమేశ్వర ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. జిల్లాలోని ఆయా ఏరియాలకు చెందిన భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు.

 గ్రామం నుంచి వాగు వరకు రోడ్డు పై ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. వాగులో స్నానాలు చేసి భక్తులు బారులు తీరి బీమేశ్వరున్ని దర్శించుకున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్​మోహన్​రావు,  మాజీ ఎమ్మెల్యే సురేందర్​లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు.