Magic Movie: మ్యాజిక్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Magic Movie: మ్యాజిక్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

ఓ  వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యంగ్ టాలెంట్‌‌‌‌ను ఎంకరేజ్ చేసేలా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను నిర్మిస్తోంది సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ సంస్థ. తాజాగా  ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్’ అనే వైవిధ్యభరితమైన  చిత్రాన్ని నిర్మించారు. ఈ మ్యూజికల్ డ్రామాలో అంతా  కొత్తవారే నటించారు. 

అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ఈ చిత్రాన్ని  విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  కాలేజీ ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నమే ఈ కథ. ఇందులో యూత్‌‌‌‌ను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు.