చంద్రుడిపై అన్వేషణలో భాగంగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3, అందులోని విక్రమ్ ల్యాండర్ లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల మేరకు ప్రయాణించి కీలక సమాచారాన్ని సేకరించింది.
ఈ సమాచారాన్ని అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పరిశోధకులు విశ్లేషించగా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై భారీ శిలాద్రవం ఉండేదన్న వాదనకు బలాన్ని చేకూర్చే విషయాన్ని వెల్లడించిందని పేర్కొన్నారు.