
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పరుపుల బ్రాండ్ మాగ్నిఫ్లెక్స్ పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ అత్యుత్తమ సౌకర్యాన్ని అందించే మాగ్నిజియో పరుపులను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రతీ కొనుగోలుపై కొనుగోలుదారు తరఫున మాగ్నిఫ్లెక్స్ ఒక మొక్కను నాటనుంది. అంతేగాకుండా కొనుగోలుదారు పేరు లేదా వారి నామినీ పేరు మీద సర్టిఫికెట్ జారీ చేస్తుందని. మాగ్నిఫ్లెక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ నిచాని చెప్పారు. మాగ్నిజియో పరుపులు రీసైకిల్డ్ ఫోమ్‌ల నుంచి తయారయ్యాయని, వీటిలో హానికరమైన ఎక్స్ పాండింగ్ ఏజెంట్స్ ఉండవని తెలిపారు. వెన్నెముకకు చాలా సౌకర్యంగా ఉంటాయని, మెమోఫార్మ్ పాడింగ్ శరీర ఆకృతికి తగ్గట్టు ఉంటుందని వివరించారు. బ్రీతబుల్ ఫైబర్స్ చాలా సౌకర్యాన్ని అందిస్తాయని ఆనంద్ పేర్కొన్నారు.