అఫ్గనిస్తాన్ లో భూకంపం...రిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు

అఫ్గనిస్తాన్ లో  భూకంపం...రిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో  భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం రాగా.. ఇండియా,చైనా,వియత్నా,బంగ్లాదేశ్ లో  స్వల్ప భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవాళ మార్చి 29న  అఫ్గనిస్తాన్ లో  భూకంపం వచ్చింది.   ఉదయం 5.16 గంటలకు 180 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కూల్ పై 4.7 గా నమోదయ్యిందని వెల్లడించింది.జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎటువంటిఆస్తి నష్టం కానీ ప్రాణనష్టం  జరిగలేదు.

మయన్మార్ , బ్యాంకాక్ లో నిమిషాల వ్యవధిలోనే ఆరు సార్లు భూమి కంపించింది.  150 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  700 మందికి పైగా గాయపడ్డారు.  వందలాది బిల్డింగ్ లు కుప్పకూలాయి.  ఎక్కడిక్కడ రోడ్లు,బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి.