తైవాన్ లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు

తైవాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే, రాజధాని తైపీలోని పలు భవనాలు భూప్రకంపనలకు ఊగాయి. భూకంప కేంద్రం 24.9 కిలోమీటర్ల లోతున ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల మొదట్లో తైవాన్‌ను 7.2 తీవ్రత కలిగిన భూకంపం కుదిపేసింది. అప్పట్లో 17 మంది కన్నుమూశారు. నాటి నుంచి ఇప్పటివరకూ అక్కడ సుమారు వెయ్యి సార్లు భూమి కంపించింది.