కోల్‌కతా : నార్వే చెస్ లెజెండ్, వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ టాటా స్టీల్ చెస్ ఆరో ఎడిషన్‌లో పోటీపడనున్నాడు. నవంబర్ 13–17 తేదీల్లో జరిగే ఈ మెగా టోర్నీకి స్టార్ అట్రాక్షన్‌గా మారనున్నాడు. ఈ టోర్నీలో మాగ్నస్ బరిలోకి దిగనుండటం ఇది రెండోసారి కానుంది. ఇది వరకు 2019లో టైటిల్ నెగ్గాడు.
కాగా, ఇటీవల చెస్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్ నెగ్గిన ఇండియా జట్టులో సభ్యులైన ఎరిగైసి అర్జున్, ఆర్. ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్‌తో పాటు నిహాల్ సరిన్, ఎస్‌ఎల్ నారాయణన్ ఓపెన్ కేటగిరీలో బరిలో నిలవనున్నారు. విమెన్స్‌లో కోనేరు హంపి, ఆర్. వైశాలి, ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వంతికా అగర్వాల్ పోటీలో ఉన్నారు.